ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఎడిటోరియల్రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ల ద్వారా పేదలకు అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యం...

రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ల ద్వారా పేదలకు అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యం – ఎమ్మెల్యే నంద్యాల వరద

📰 Generate e-Paper Clip

–తగ్గింపు ధరలకు సన్నం బియ్యం విక్రయాల ప్రారంభం

 

సలాం ప్రొద్దుటూరు:

 

పేద ప్రజలకు నాణ్యమైన సన్నం బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ల ద్వారా తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ప్రారంభించిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు.

 

 

ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని బియ్యం విక్రయాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరలో అందించడం ద్వారా వారి జీవన వ్యయాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఎంఆర్‌వో ఉదయ భాస్కర్ రాజు, సివిల్ సప్లై డీటీ అజర్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు మురళీధర్ రెడ్డి, కమాల్ బాషా, బయ్యపురెడ్డి నరసింహారెడ్డి, సివిల్ సప్లై శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!