ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeఎడిటోరియల్కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికీ వివరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికీ వివరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు(చాపాడు):

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చాపాడు మండలంలోని బదిరపల్లి, నేరవాడ గ్రామాల్లో నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు చాపాడు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో హిందూ స్మశానవాటికల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రజల విజ్ఞప్తి మేరకు అవసరమైన చోట సిమెంట్ రోడ్లు మంజూరు చేస్తూ గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో చాపాడు సొసైటీ బ్యాంకు చైర్మన్ నరసింహారెడ్డి, కేసీ కెనాల్ వైస్ చైర్మన్ గుర్విరెడ్డి, టీడీపీ మైనార్టీ పార్లమెంట్ కార్యదర్శి అక్బర్ సలీం, జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల బాబు, మాజీ సర్పంచ్ గుత్తి వీరనారాయణ, లక్ష్మీపేట శేఖర్ రెడ్డి, స్వామి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!