కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికీ వివరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి

సలాం ప్రొద్దుటూరు(చాపాడు): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చాపాడు మండలంలోని బదిరపల్లి, నేరవాడ గ్రామాల్లో నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు చాపాడు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు....