ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeఎడిటోరియల్చిట్వేల్ దళితుల సమస్యలు పరిష్కరించాలని, ప్రజా సంఘాల ధర్నా!

చిట్వేల్ దళితుల సమస్యలు పరిష్కరించాలని, ప్రజా సంఘాల ధర్నా!

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (చిట్వేల్):

తిరుపతి జిల్లా  చిట్వేల్ మండల దళిత గ్రామాలలో సామాజిక సర్వేలో భాగంగా,  వచ్చిన సమస్యలపై, సోమవారం ఎమ్మార్వో, ఆఫీస్ వద్ద, ధర్నా నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల మండల పరిధిలోని దళిత గ్రామాలలో అనేక సమస్యలు గుర్తించడం జరిగిందని వారు తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ లో  చిట్వేల్ ఎమ్మార్వో ను స్మశానాలు, రోడ్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వీధిలైట్లు, పెన్షన్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని  కోరారు . చిట్వేల్ మండల పరిధిలో దాదాపు 43 దళిత గ్రామాలు ఉన్నాయనీ ఆ గ్రామాలలో  సామాజిక  సమస్యలపై జిల్లా కమిటీలు సామాజిక సర్వే నిర్వహించారన్నారు.  గ్రామాలలో ఉన్న సమస్యలు తమ  దృష్టికి తీసుకువచ్చారనీ ఈ సమస్యలపై దళిత గ్రామాలను సందర్శించి దళిత సమస్యలు పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని  కోరారు. అందులో ప్రధానంగా, మిట్టపల్లి దళితవాడలో, దళితులు ఓటు హక్కు వినియోగించుకోకుండా అగ్రవర్ణాల అడ్డుకుంటున్నారని, అందుకు ప్రత్యేక పోలింగ్ పోతే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మార్వో స్పందించి పోలింగ్ బూత్ ఏర్పాటు చేసే దానికి కృషి  చేస్తానని హామీ  ఇచ్చారు. స్మశానానికి సర్వే చేయమని ఆదేశించారు. వీధిలైట్లు వేయాలని  ఆదేశించారు. త్వరలో   గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా తిమ్మయ్య గారి పల్లెలో స్మశానానికి దారికి ఇద్దరు అగ్రవర్ణాల వారు అడ్డుకుంటున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. వికలాంగుల కు గట్టుమీద పల్లెలో ఇచ్చిన ఇండ్ల స్థలాలు చూపించాలని కోరారు. ఆ సమస్య సర్వే చేసి వారి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మళ్లీమడుగు ప్రాంతంలో 1970 సర్వే నెంబర్లు, 150 ఎకరాలు అగ్రవర్ణాలు భూకబ్జాలో పాల్పడుతున్నారని, తక్షణం దళితులకు ఆ భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ , ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యులు, పందికాళ్ళ  మణి, కెవిపిఎస్ జిల్లా నాయకులు, ఓబిలి పెంచలయ్య, రైతు సంఘ నాయకులు, శంకరయ్య, భాష, హైమావతి, వసంత, తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!