సలాం ప్రొద్దుటూరు (శ్రీశైలం):
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి సోమవారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ కుమార్తె కావ్య రెడ్డి, అల్లుడు బండి వినీత్ రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న రాచమల్లు కుటుంబ సభ్యులు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
దర్శనం అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని కుటుంబ సభ్యులు ప్రార్థించినట్లు తెలిపారు.
