సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత రెండేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారినప్పటికీ పట్టణానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులోని వైఎస్ఆర్సిపి వార్డ్ ఇంచార్జ్ ఖాజా ఆఫీస్ లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ పర్యవేక్షణలో, కోర్టు ఆధీనంలో ఉన్న ఆస్తికి పేరు మార్పిడి ఎలా జరిగిందో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకుంట షేక్ ఖాజా, మాజీ కౌన్సిలర్ పాతకోట వంశీ రెడ్డి, జిల్లా యువజన విభాగం ఉపాధ్యకులు ఎం సందీప్ పాల్గొన్నారు.
