ప్రతి సోమవారం ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ కార్యక్రమం

  –సమస్యల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి–మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం   ప్రొద్దుటూరు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ కార్యక్రమం యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.   ముఖాముఖీ కార్యక్రమం అనంతరం రెగ్యులర్ PGRS కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని సూచించారు....