ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఎడిటోరియల్పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఎమ్మెల్యే వరద

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బృహత్ మొక్కల నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కార్యదర్శి గండ్లూరు శ్రీధర్ శర్మలను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.కార్యక్రమంలో నంద్యాల రాఘవరెడ్డి, రోటరీ ఐ హాస్పిటల్ అధ్యక్షుడు పీడీజీ ఎంవీఎన్ ప్రభు, సీనియర్ రోటేరియన్ కోట శివకుమార్, రోటరీ వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరు రవికుమార్ రెడ్డి, క్లబ్ సభ్యులు, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, పాఠశాల కమిటీ అధ్యక్షుడు రాజువారి బలరాముడు, సింగిల్ విండో అధ్యక్షుడు రాజువారి వెంకటసుబ్బయ్య, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు దివ్యమణి, ఉపాధ్యాయుడు వై. సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!