పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బృహత్ మొక్కల నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కార్యదర్శి...