మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్‌జీఓస్ సంఘం ప్రతినిధులు
–సంఘం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ – కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఘన సన్మానం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్‌జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌ను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ, తనకు ఏపీ ఎన్‌జీఓస్ సంఘంపై ప్రత్యేక అభిమానం ఉందని, తాను కూడా సంఘం నేపథ్యం నుంచి వచ్చిన...