సలాం ప్రొద్దుటూరు:
చట్నీలో బల్లి పడిన ఘటనపై హోటల్ నిర్వాహకుడు, మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సుబ్బన్న గారి వీధిలో నివాసం ఉంటున్న షేక్ సోహెల్ టిఫిన్ తెచ్చేందుకు శుక్రవారం రామేశ్వరం రోడ్ లోని గణేష్ హోటల్ కు వెళ్లాడు. అక్కడ ఒక ప్లేటు కట్టించుకుని ఇంటికి వెళ్ళాడు. అతని భార్య పూరి తినే సమయంలో చట్నీలో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో సోహెలు హోటల్ వద్దకు వెళ్లి చట్నీలో బల్లి పడిన విషయాన్ని హోటల్ యజమాని సత్యనారాయణ రెడ్డికి తెలిపాడు. అయితే హోటల్ యజమానితోపాటు వంట మాస్టారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సోహెల్ ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత అతని భార్యకు కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరము అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి హోటల్ పై ఫిర్యాదు చేశాడు. వన్ టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు హోటల్ కి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు హోటల్ యజమాని, వంట మాస్టర్ పైకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
