సలాం ప్రొద్దుటూరు :
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించాలని టీడీపీ నాయకులు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వి.ఎస్ ముక్తియర్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహితమని పేర్కొన్నారు.
రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించిన వారు, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించడమేనని, భవిష్యత్తులో వాటి వల్ల కలిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాచమల్లు రాజకీయంగా పలుమార్లు పార్టీలు మారిన చరిత్ర ప్రజలకు తెలుసని, అందువల్ల ప్రజలు వాస్తవాలను గుర్తించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించాలని సూచించారు.
నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయాలి
మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రొద్దుటూరులో ఘన స్వాగతానికి పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరు పట్టణాన్ని విద్యా, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
