సలాం ప్రొద్దుటూరు (కడప) :
కడప జిల్లా పర్యటన సందర్భంగా కడప విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం అందజేసి మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే, జిల్లా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు.
జిల్లాలో నిర్వహించనున్న పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో నాయకులతో మంత్రి నారా లోకేష్ స్వల్పంగా సమావేశమై పర్యటనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
