ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన

కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన

📰 Generate e-Paper Clip

 

 

–దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన.. ప్రొద్దుటూరు సమీపంలోనూ పర్యటన

సలాం ప్రొద్దుటూరు:

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 14, 15 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది.

 

జూలై 14 (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న మంత్రి లోకేష్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7:45 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని కరమలవారిపల్లి (గూటి–నెల్లూరు హైవే) వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడే రాత్రి బస చేయనున్నారు.

 

జూలై 15 (బుధవారం) ఉదయం 9:15 గంటలకు కరమలవారిపల్లి నుంచి బయలుదేరి, 9:30 నుంచి 11:30 గంటల వరకు మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలోని దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

 

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జమ్మలమడుగు నుంచి బయలుదేరి, 2:45 గంటలకు ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లి గ్రామం (బొల్లవరం రూరల్) చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజర్వ్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

తదుపరి సాయంత్రం 5 గంటలకు దొరసానిపల్లి నుంచి కడప విమానాశ్రయానికి బయలుదేరి, 5:50 గంటలకు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడకు విమానంలో బయలుదేరనున్నట్లు అధికారిక షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!