కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన
–దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన.. ప్రొద్దుటూరు సమీపంలోనూ పర్యటన సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 14, 15 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. జూలై 14 (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న మంత్రి లోకేష్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7:45 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని కరమలవారిపల్లి (గూటి–నెల్లూరు హైవే)...