ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్నెల రోజులుగా విజయవంతంగా కొనసాగిన SIR హెల్ప్ డెస్క్

నెల రోజులుగా విజయవంతంగా కొనసాగిన SIR హెల్ప్ డెస్క్

📰 Generate e-Paper Clip

 

 

–వేలాది మందికి సేవలు.. ప్రజల మన్ననలు పొందిన బేపారి ఆరిఫ్ బృందం

 

సలాం ప్రొద్దుటూరు: 

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో ప్రజలకు చేయూతనందించేందుకు ప్రొద్దుటూరులోని జామియా మస్జిద్ ప్రాంగణంలో బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SIR హెల్ప్ డెస్క్ నెల రోజుల సేవలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

 

ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వేలాది మంది ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, దరఖాస్తు ఫారాలు నింపడం, అవసరమైన పత్రాలపై మార్గదర్శకత్వం ఇవ్వడం వంటి సేవలు అందించారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు ఆరిఫ్ బృందం ఓర్పుతో సహకరించి, వారి దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది.

 

సామాజిక బాధ్యతలో భాగంగా హెల్ప్ డెస్క్ నిర్వహణ సమయంలో ఒక రోజు స్థానిక వృద్ధాశ్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించి, వృద్ధులను పరామర్శించి అవసరమైన సహాయాన్ని అందించారు.

 

నెల రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. బేపారి ఆరిఫ్ మరియు ఆయన బృందం మద్దూరు మున్నా, వరపకుల ఖాదర్ బాషా, అలీ అక్బర్, రఫీ, సన్నావుల్ల అందించిన సేవలను స్థానికులు అభినందిస్తూ, యువత సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!