సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం ప్రొద్దుటూరుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బీ (R&B) గెస్ట్ హౌస్లో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మల్లెల లింగారెడ్డి మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి వంటి పలు అంశాలపై స్వల్పంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి అనం రామనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
