ఉపాధి హామీ పనుల విస్తరణతో గ్రామీణాభివృద్ధికి ఊతం- ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండల పరిధిలోని చెన్నమరాజుపల్లె గ్రామపంచాయతీ నాగయపల్లె గ్రామ చెరువు వద్ద గురువారం నిర్వహించిన వికసిత్ భారత్–జీ రామ్‌జీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంపొందించే లక్ష్యంతో గతంలో 100 రోజులుగా అమలులో ఉన్న ఉపాధి హామీ పనులను 125 రోజులకు విస్తరించడం ద్వారా గ్రామీణ కార్మికులకు మరింత ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధితో పాటు చెరువులు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డి, ఏపీఓ మహేశ్వర రెడ్డి, రాజువారి వెంకటసుబ్బయ్య, శ్రీనివాసుల రెడ్డి, శేషారెడ్డి, పెద్ద బాలయ్య, రాముడు, ఓబన్న, పట్నం వెంకటరమణ, రాజా, బాలగురయ్య, వెంకటసుబ్బయ్య, గంగయ్య, బలరాముడు, జయరాముడు, శేఖర్, సుబ్బారెడ్డి, ప్రసాద్, ఓబులేసు, సంజీవరాయుడు, కొండయ్య తదితరులు, చెన్నమరాజుపల్లె గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
