ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeఎడిటోరియల్కడప బ్రాహ్మణ వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

కడప బ్రాహ్మణ వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కడప):

బుధవారం కడప నగరంలోని 31వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించారు. డివిజన్ ఇన్‌చార్జ్ సయ్యద్ నయా బాషా ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్‌లు 103 – ఎస్‌ఎండీ బాబ్జీ బాషా, 105 – జీలాన్, 106 – మయానా ఇస్మాయిల్ ఖాన్, 107 – ఫాజిల్, 147 – జమీల్ పాల్గొని పింఛన్ల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించారు.పింఛన్ అందుకున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రతి నెలా ఆర్థిక భరోసా అందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!