ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎంఈవో సావిత్రమ్మ ను సస్పెండ్ చేయాలి

ఎంఈవో సావిత్రమ్మ ను సస్పెండ్ చేయాలి

📰 Generate e-Paper Clip

 

–ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న ఎంఈవో సావిత్రమ్మ.

 

–ఎనిమిది సంవత్సరాలుగా ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగడంలో ఆంతర్యమేమిటి.

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు పట్టణ ఎంఈవో సావిత్రమ్మ ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు వత్తాసుపలుకుతున్నదని ఒకే పోస్టులో ఎనిమిది సంవత్సరాలుగా కొనగుతుండటంలో అంటయమేమిటని CITU కార్యదర్శి సత్యనారాయణ, DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, DYFI, SFI ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శులు విశ్వనాథ్,చార్లెస్ తెలిపారు.మంగళవారం నాడు ఎంఈవో సావిత్రమ్మ ను సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రొద్దుటూరు ఎంఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరు ఎంఈవో సావిత్రమ్మ వ్యవహార శైలి కొనసాగుతుందని అన్నారు.ఒకే పోస్టులో ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్నది అని దీని అంతర్యం ఎమిటో ఉన్నతాధికారులు తెలపాలని అన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగ ఒకే చోట 5 సంవత్సరాలు కు మించి ఉండరాదని చెబుతున్నా ప్రొద్దుటూరు ఎంఈవో సావిత్రమ్మ కు మాత్రం ఈ నిబంధన వర్తించదు అన్నట్టు ఉన్నారు అన్నారు.ప్రొద్దుటూరు పట్టణంలో ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలలు విచ్చల విడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని వేలకు వేల రూపాయలు ఫీజులు రూపం లో తల్లిదండ్రుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నాయని అన్నారు.అవే కాకుండా పాఠ్యపుస్తకాలు,యూనిఫారం లు కూడా బహిరంగంగా అధిక మొత్తంలో అమ్ముతున్నారు అన్నారు.కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఫీజుల దోపిడీకి ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలలు పాల్పడుతున్నాయని అన్నారు.ఇవన్నీ ఎంఈవో సావిత్రమ్మకు తెలిసినా చూసి చూడనట్టు వివరిస్తున్నది అన్నారు.ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నది అన్నారు.తక్షణమే ఆమె పై ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేయాలని లేని పక్షంలో అందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.మధు,రఘునాథ్, కల్యాణ్,రాజేష్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!