ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? లేక బాబు ప్రైవేట్ సైన్యం ఉందా?

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? లేక బాబు ప్రైవేట్ సైన్యం ఉందా?

📰 Generate e-Paper Clip

 

–లాకప్ డేత్ కేసులు సీఐడీ తో విచారణ జరపాలి..

–బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం

– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు:

 

సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత రాష్ట్రం లో పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం లేదనిపిస్తుందనీ పోలీస్ శాఖ పనిచేయడం లేదనీ కేవలం బాబు ప్రైవేటు సైన్యం పనిచేస్తుందనీ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత వారం రోజు నుంచి మలుపులు తిరిగి కేవలం సిఐ నాగరాజు అరెస్ట్ చేశారన్నారు.సాయి కృష్ణ కేసులో రాష్ట్ర పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ కేసును సీఐడీకి అప్పగించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో అసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరో బయటకు రావాలి. పూర్తిస్థాయి విచారణ జరిగితేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. అందుకే సీఐడీ విచారణ అవసరం అని పేర్కొన్నారు.న్యాయం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తాం అని అన్నారు. కోర్టు హాజరు కాకపోవడం వల్ల సాయి కృష్ణ పై రెండు వారెంట్లు జారీ అయ్యాయనీ ఈ కారణం చూపించి టాస్క్ ఫోర్స్ అతని మార్కాపురంలో పట్టుకున్నారన్నారు. అక్కడినుంచి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో , హోటల్ లో సాయి కృష్ణకు చిత్ర హింసలు పెట్టి చంపేసారన్నారు. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్, హోటల్లో , చికిత్స చేసిన మణిపాల్ హాస్పిటల్ లో సీసీ ఫుటేజ్ లు అలాగే స్మశాన వాటికలో సీసీ ఫుటేజ్ లు మాయం కావడం సర్వత్ర అనుమానాలకు దారితీస్తు ఉందని ఆయన అన్నారు. కనీసం చనిపోయిన కుమారుడు శవం తల్లి కూడా ఇవ్వకుండా అనాధా శవంలా స్మశాన వాటికలో తీసుకెళ్లి బూడిద చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి గర్భశోకాన్ని గుర్తించి మానవతవాదులు, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ ఆ తల్లి పరామర్శించారని న్యాయ పోరాటం జరిగింతవరకు తాము తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారన్నారు. జగన్ వెళ్లి వచ్చాక బాబు ఆ ఇంటికి వెళ్లారని ఆ తల్లికి ఏం న్యాయం చేశారొ చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులు ఈ కేసులు విచారణ చేస్తే ఆ తల్లికి న్యాయం జరగదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లాక్ అప్ డెత్ కేసులకు సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖ విచారణ చేపట్టకూడదని చేపడితే అందులో న్యాయం జరగదని కేవలం సిబిఐ ద్వారా విచారణ చేపడితే న్యాయం జరుగుతుందనీ బీహార్ లో జరిగిన సంఘటన గురించి గుర్తుచేసి సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు ను రాచమల్లు వివరించారు. సిబిఐ విచారణ చేసి పాత్రధారులు ఎవరో? సూత్రధారులు ఎవరో? బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.₹20 నుంచి 40 కోట్ల వరకు ల్యాండ్ డీల్ కు సాయి కృష్ణతో సంబంధం ఉండడం వల్ల ఓ ఎమ్మెల్యే , ఎంపీ, పోలీస్ శాఖ ఒక బిగ్ బాస్ ఈ ఉదాంతం నడిపారని కానీ దోషిగా మాత్రం కేవలం సిఐ పైన వేసి చేతులు దులుపుకున్నారని ఆయన అన్నారు. ఇది వందకు వందశాతం కుట్రని ఆయన అభివర్ణించారు. సిఐ నోరు విప్పితే ఈ ఉదాంతం గల కారణాలు బయట పెడతారని అప్పుడు దీని వెనకాల ఉన్నవారు బయటకు వస్తారని ప్రభుత్వం కూడా పడిపోవచ్చని ఆయన అన్నారు. కేవలం పాత్ర దారుడనీ ఇరికించి సూత్రధారులు తప్పించుకున్నారని ,సూత్రధారులకు శిక్ష పడితే తప్ప ఆ తల్లికి న్యాయం జరగదని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం మాత్రమే కాకుండా చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాచమల్లు కోరారు.ప్రభుత్వం ఇచ్చే హామీలు కాకుండా బాధితులకు న్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలి. నిజాలు బయటపడే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!