ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్మట్టి మసీదు వీధిలో పీర్ల ఊరేగింపు

మట్టి మసీదు వీధిలో పీర్ల ఊరేగింపు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

మట్టి మసీదు వీధిలోని పీర్ల చావడిలో కొలువు దీరిన పీర్ల ను మంగళవారం సాయంత్రం వీధుల్లో ఊరేగించారు. 25 వార్డు సంబంధించి వార్డ్ ఇంచార్జ్ కమలాపురం షేక్ ఖాదర్ వలీ , వార్డు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

పీర్ల చరిత్ర:

పవిత్ర  నెల  మొహరం ప్రారంభమై ఆరు రోజులు పూర్తి అయింది. పట్టణంలోని మట్టి మసీదు విధి , మున్సిపల్ పార్క్ వెనుకల, సుందరాచార్యల వీధిలో , నడింపల్లి లోని తత్తూరు పిండి మిషన్ వద్ద, పెన్నా నగర్, ఈశ్వర్ రెడ్డి నగర్, అలాగే పట్టణంలోనే కాకుండా మండలంలోని చాలా గ్రామాల్లో పీర్ల చావడీలో పీర్లు కొలువైనారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మత సామరస్యానికి చిహ్నంగా పీర్ల పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇరాక్ దేశం కర్బలాలో ఇమామే హుస్సేన్ ర జి ఆయన కుటుంబీయులు మొత్తం 72 మంది పవిత్ర యుద్ధంలో 15000 వేలకు పైగా శత్రువులతో మానవత్వాన్ని కాపాడేందుకు , మహమ్మద్ ప్రవక్త స అ ఆచరణను (సున్నతులను), ఇస్లాం కాపాడేoదుకు పోరాడి వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచంలోని అన్ని దేశాల ల లో ఉన్న ముస్లింలు , షియా వర్గం, మానవతావాదులు మొహరం నెల ప్రారంభం కాగానే ఇమామ్ హుస్సేన్ ర జి చేసిన త్యాగం గుర్తుచేసుకొని అన్ని ప్రాంతాల్లో ఫాతిహాలు నిర్వహించి అన్నదానాలు, షర్బత్లు ఆకలిగా ఉన్నవారికి , భక్తులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. స్తోమత ఉన్నవారు ఇరాక్ దేశంలోని కర్బలాకు వెళ్లి ఇమామ్ హుస్సేన్ (పీర్లు) ర జి దివ్య సమాధి ను దర్శించుకుని కన్నీటి మునిరై వస్తారు. ప్రతి ఏటా కర్బలాకు కోట్ల సంఖ్యలో ప్రపంచం వ్యాప్తంగా భక్తులు వెళ్లడం ఆనవాయితుగా నడుస్తుంది. స్తోమత లేని వారు అలాగే పీర్లను స్మరించుకుంటూ పీర్ల చావడిలో మొహరం నెల వంక కనబడతానే ఏర్పాటు చేస్తారు. భక్తులు పీర్ల చావిడి వద్ద వెళ్లి పాతేహా లు నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!