ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్తల్లి మరణం .. భర్తను లేపేసింది ..

తల్లి మరణం .. భర్తను లేపేసింది ..

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ఆమె, ప్రియుడు కలసి భర్త పైనున్న రెండు 2️⃣ కోట్లు ఇన్సూరెన్స్ కోసం…

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

 

తల్లి మహాదేవితో నిందితురాలు సుమ (ఫైల్)

 

ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్గా మారింది.

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది.

 

ఈ సంఘటనతో ఆమె, ఆమె ప్రియుడు కటకటాల్లో ఉన్నారు.

 

బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సెలైన్లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది.

 

ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది.

 

శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

 

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!