ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్అభివృద్ధి – సంక్షేమం – సుపరిపాలన అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.. ఎమ్మెల్యే...

అభివృద్ధి – సంక్షేమం – సుపరిపాలన అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.. ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

అభివృద్ధి – సంక్షేమం – సుపరిపాలన” అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వరద స్పష్టం చేశారు.రెండేళ్ల కూటమి పరిపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే వరద ప్రసంగించారు.రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో ప్రభుత్వం విశేష కృషి చేసిందని తెలిపారు. రైతులకు అవసరమైన మద్దతు, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.అలాగే రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, గ్రామీణాభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని పొందిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే వరద అన్నారు. ప్రజల సహకారం, కార్యకర్తల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!