ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్చర్చి గేట్లకు తాళాలు

చర్చి గేట్లకు తాళాలు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

కడప జిల్లా ప్రొద్దుటూరులోని విజయనగరం వీధిలోని బేతనీయ చర్చిలో పాస్టర్ల మధ్య నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పాస్టర్ నియామకం పై విభేదాలు తలెత్తడంతో చర్చి గేట్లకు తాళాలు వేశారు .దీంతో భక్తులతో కలిసి కొత్త పాస్టర్ రోడ్డుపైనే కూర్చుని ప్రార్థనలు నిర్వహించడం చర్చనీయంగా మారింది..ప్రొద్దుటూరులోని బేతనీయ చర్చికి ఇటీవల నూతన పాస్టర్‌ను నియమించడంతో చాలా కాలంగా చర్చిలో సేవలందిస్తున్న మరో పాస్టర్ తాను చర్చిని విడిచి వెళ్లబోనని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ రోజు ప్రార్థనలు జరగాల్సిన సమయంలో చర్చి గేట్లకు తాళాలు వేసి లోపలికి ఎవరినీ అనుమతించలేదని కొత్త పాస్టర్ వర్గం ఆరోపిస్తోంది. దీంతో చర్చిలో ప్రార్థనలకు ఇబ్బందులు తలెత్తడంతో చర్చి బయట రోడ్డుపైనే మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు నిర్వహించారు.చర్చి వ్యవహారంలో తలెత్తిన ఈ వివాదానికి త్వరగా పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!