సలాం ప్రొద్దుటూరు (కొండాపురం ):
కొండాపురం జడ్పీహెచ్ఎస్లో CDPO ఓబుళమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు నవ చేతన యాప్పై శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. 0-6 ఏళ్ల పిల్లల అభివృద్ధి మైలురాళ్ల ఆధారంగా స్క్రీనింగ్ చేసే విధానాన్ని CDPO వివరించారు. డాక్టర్ సుజాత పిల్లల్లో కనిపించే 4-Ds (జన్యు లోపాలు, పోషక లోపాలు, వ్యాధులు, అభివృద్ధి ఆలస్యం) గురించి అవగాహన కల్పించారు. తొలి 1000 రోజుల సంరక్షణ పిల్లల మెదడు వికాసానికి కీలకమని వారు తెలిపారు.
