ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విజయవాడ రాష్ట్రస్థాయి సూఫీ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలి

విజయవాడ రాష్ట్రస్థాయి సూఫీ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

 

–ధర్మవరంలో సూఫీ, ఖాద్రి పీఠాధిపతుల ఆత్మీయ సమావేశం

సలాం ప్రొద్దుటూరు (ధర్మవరం) :

సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్లో సూఫీ మరియు ఖాద్రి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సూఫీ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొని సోదరభావం, శాంతి, సామరస్య సందేశాలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా బీజాపూర్ పీఠాధిపతి మొయినుద్దీన్ బాంగి అబ్బాసి, జమ్మలమడుగు ఆస్థాన పీఠాధిపతి ఖాదర్ వలీ, జమ్మలమడుగు పీఠాధిపతి ధర్మవరం దాదా పీర్ సాహెబ్ తదితరులు మాట్లాడుతూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువల పరిరక్షణలో సూఫీ సంప్రదాయాల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అలాగే త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి భారీ సూఫీ కాన్ఫరెన్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సూఫీ అనుచరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూఫీ బోధనలు ప్రేమ, శాంతి, సహనం మరియు మానవ సేవకు ప్రతీకలని, యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోషన్ జమీర్, డి3 న్యూస్ సీఈఓ, తెలుగు పత్రిక న్యాయవాణి ఎడిటర్ దాదాసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!