ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్టిడిపి హయాంలోనే ₹ 1.75 కోట్ల సొమ్ము మాయం.. వైసిపి హయాంలో కాదు – బంగారు...

టిడిపి హయాంలోనే ₹ 1.75 కోట్ల సొమ్ము మాయం.. వైసిపి హయాంలో కాదు – బంగారు రెడ్డి 

📰 Generate e-Paper Clip

      –మాపై ఆరోపణలు నిరూపిస్తే రామేశ్వరం వదిలేస్తాం .. మారుమూల గ్రామం వెళ్తాం..

సలాం ప్రొద్దుటూరు:

తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చి రెండేళ్లు .. 8 నెలల వరకు ఉన్న 268 టన్నుల ఇనుప కడ్డీలు ఇప్పుడు లేవు.. అధికారులు మీవారే .. అధికారం మీ ప్రభుత్వం దే.. మీ ప్రమేయం లేకుండా ఇలా పోతాయి? టిడిపి హయాంలోనే ₹1.75 కోట్ల సొమ్ము మాయమైంది.. మా వైసీపీ హయాంలో కాదని.. ఇది ఎమ్మెల్యే వరదా తెలుసుకోవాలని వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆదివారం స్థానిక వన్ టౌన్ సర్కిల్ మట్టి మసీదు వీధిలో ఉన్న వైఎస్ఆర్సిపి వార్డ్ ఇంచార్జ్ ఫరీద్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఆయన మాట్లాడారు.హౌసింగ్ సంబంధించిన కడ్డీలు మాయం విషయం పై తెలుసుకున్న పిడి , విజయవాడ నుంచి ఉన్నతాధికారులు ప్రొద్దుటూరు కు శనివారం వచ్చి తనిఖీలు చేసి విచారించారన్నారు. 2025 9వ నెల ఐదవ తేదీ వరకు 268 టన్నుల ఇనుప కడ్డీలు సుమారు ₹1.75 కోట్ల విలువగల కడ్డీలు 8 నెలల క్రితం ఉన్నట్లు అలాగే రిజిస్టర్ లో కూడా నమోదు చేశామని అధికారులు చెప్పారన్నారు. అలాగే విజిలెన్స్ ఎంక్వయిరీ లో కూడా ఆ కడ్డీలు గోడౌన్ లోనే ఉన్నట్లు అధికారులు చెప్పారని ఆయన వివరించారు. ₹కోట్ల సొమ్ము మాయమైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో కాదని ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇది జరిగిందని ఆయన వివరించారు.అయితే ఎమ్మెల్యే వరద మాత్రం ఎలాంటి అవగాహన లేకుండా మాపై అవక్కులు చవాకులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ₹ కోట్ల సొమ్ము ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఎలా అమ్ముకుంటారని ఆయన ఆరోపించారు. కడ్డీలు మాయం చేసిన రోజు నుంచి సుబ్రమణ్యం ప్రతిరోజు ఎమ్మెల్యే ఆఫీసుకు వెళ్తున్నారన్నారు.

మాపై ఆరోపణలు నిరూపిస్తే రామేశ్వరం వదిలేస్తాం .. మారుమూల గ్రామం వెళ్తాం..

ల్యాండ్ అక్విజేషన్లో రాధాస్వామి భక్తులు రామేశ్వరం సంబంధించి బిజినపల్లి వారు ఆరు ఎకరాలు పోయిందన్నారు . ఒక ఎకరాకు 10 లక్షలు తీసుకున్నారని తమపై ఆరోపిస్తున్నారని ఆయన చెప్పారు. ఆ బిజినపల్లి వాళ్లతోనే ఎకరాకు 50,000 తీసుకున్నామని నిరూపించిన తాము తమ కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని ఆయన సవాల్ విసిరారు. తమ పై ఆరోపణలు నిరూపిస్తే రామేశ్వరం వదిలేస్తాం అని .. మారుమూల గ్రామం వెళ్లి నివసిస్తామని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపైన గతంలో ఎమ్మెల్యే విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సీఎంకు హౌసింగ్ భూముల కుంభకోణమని లెటర్ ఇచ్చి వచ్చారని గుర్తు చేశారు. సుమారు రెండేళ్ల అవుతున్న విజిలెన్స్ ఎంక్వయిరీ గురించి ఎందుకు ఎమ్మెల్యే బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూనే ఉందా అని ప్రశ్నించారు. అవినీతి జరిగితే నిరూపించాలని సవాల్ విసిరారు. శనగల గోడౌన్ లోఒక మూట పై 250 రూపాయలు అధికంగా వసూలు చేసినందుకు ఎమ్మెల్యే,ఆయన కుమారుడు పై చంద్రబాబు, లోకేష్ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఒక రైతు వద్ద నుంచి 250 రూపాయలు అధికంగా వసూలు చేసినందుకే చంద్రబాబు ఫిర్యాదు అందినప్పుడు తాము ఒక రైతు నుంచి ఒక ఎకరాకు పది లక్షలు తీసుకుని ఉండింటే తమ కూడా ఫిర్యాదు చేసేవారు కాదా అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!