సలాం ప్రొద్దుటూరు (వై వి యు యూనివర్సిటీ):
యోగి వేమన విశ్వవిద్యాలయం అనువర్తిత గణిత శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్ధి గట్టు వెంకట రాముడుకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ని శుక్రవారం ప్రదానం చేసింది. ఆచార్య జి. కాత్యాయని పర్యవేక్షణలో “ఎనాలిసిస్ అఫ్ ఫ్లో అండ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ వేరియస్ జియోమెట్రిక్ ఎక్స్ప్లోసర్స్” అనే అంశంపై చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్ ని ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణా అధికారి ఆచార్య కె.స్వీ.కృష్ణారావు ప్రకటించారు. ఈయన రాసిన పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన రాముడుకు వీసీ, రిజిస్ట్రార్, స్కాలర్లు, విద్యార్థులు అభినందించారు.
