ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ఖిద్మత్ సొసైటీ సేవలకు గుర్తింపుగా ఎమ్మిగనూరు బ్రాంచ్‌కు సత్కారం

ఖిద్మత్ సొసైటీ సేవలకు గుర్తింపుగా ఎమ్మిగనూరు బ్రాంచ్‌కు సత్కారం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (ఎమ్మిగనూరు):

ఎమ్మిగనూరు ఖిద్మత్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (MACCS) ఆధ్వర్యంలో సభ్యులకు అందిస్తున్న సేవలు, ఆర్థిక సహకారం మరియు సామాజిక కార్యక్రమాలను గుర్తిస్తూ ఖిద్మత్ హెడ్ ఆఫీస్ అధికారులు ఎమ్మిగనూరు బ్రాంచ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా  బ్రాంచ్ మేనేజర్ షోయబ్ అక్తర్ ,బ్రాంచ్ మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రెసిడెంట్ ముల్ల ఇస్మాయిల్ గారికి ప్రశంసా షీల్డ్‌ను అందజేసి సత్కరించారు. సభ్యుల సంక్షేమం, వడ్డీ రహిత ఆర్థిక సేవల విస్తరణ మరియు సంస్థ అభివృద్ధికి చేసిన కృషిని హెడ్ ఆఫీస్ అధికారులు కొనియాడారు.భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో సభ్యులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!