సలాం ప్రొద్దుటూరు (పీలేరు):
పీలేరు పాత బస్టాండ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అత్యవసర చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
