ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్నన్ను నాయకుడిని చేసింది రామేశ్వరం ప్రజలే...

నన్ను నాయకుడిని చేసింది రామేశ్వరం ప్రజలే…

📰 Generate e-Paper Clip

 

–ఎమ్మెల్యే వరద పాత్ర ఇందులో సున్నా ..

 

– ప్రశ్నలకు జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలేనా?

 

– ఎమ్మెల్యేపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు

 

సలాం ప్రొద్దుటూరు:

 

“నన్ను నాయకుడిని చేసింది రామేశ్వరం ప్రజలు .. వారు నా ముఖం చూసి కాదు నా మేనమామ పాతకోట విజయ ముని రెడ్డి ను చూసి నాకు ఓటు వేసి 1998లో రామేశ్వరం ప్రజలు నాకు కౌన్సిలర్ గా గెలిపించారు. నన్ను నాయకుడిని చేసింది ఇంతటి వాడిగా ఎదగడానికి కారణమైంది రామేశ్వరం ప్రజలు, నా మేనమామే.. ఎన్ని జన్మలెత్తిన రామేశ్వరం ప్రజల రుణం తీర్చుకోలేను .. నా జన్మ రామేశ్వరంలోనే నా తుది శ్వాస కూడా రామేశ్వరంలోనే ” అని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి భావోద్వేగంగా చెప్పారు.

గురువారం దొరసానిపల్లి లోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

తన రాజకీయ ప్రస్థానం ఏ ఒక్క నాయకుడి దయాదాక్షిణ్యంతో కాదని, రామేశ్వరం ప్రజల విశ్వాసం, ఆశీర్వాదంతోనే ప్రారంభమైందని స్పష్టం చేశారు. కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా, ప్రజాప్రతినిధిగా తనకు లభించిన ప్రతి అవకాశం ప్రజల తీర్పు ఫలితమేనని, జీవితాంతం రామేశ్వరం ప్రజలకు రుణపడి ఉంటానని వివరించారు.

 

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రెండు రోజుల క్రితం తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం అధికార పార్టీ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

 

ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నిలదీశారు.రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, గంజాయి వ్యాప్తి, జూదం, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు వంటి అంశాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే వ్యక్తిగత ఆరోపణలను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు.

 

 

 

తన ఎదుగుదలను వ్యక్తిగతంగా ఎవరైనా తమ ఖాతాలో వేసుకోవడం వాస్తవాలను వక్రీకరించడమేనని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో బలం తక్కువగా ఉన్న సమయంలో కూడా పార్టీ కోసం బాధ్యతలు స్వీకరించి పనిచేశానని గుర్తు చేశారు.

 

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలు, కుటుంబాల ప్రస్తావన చేయడం రాజకీయ సంస్కృతికి తగదని రాచమల్లు అన్నారు. ప్రజలకు జవాబుదారీతనం చూపాల్సింది అధికార పార్టీనే గానీ, విమర్శలను మళ్లించే ప్రయత్నం చేయడం కాదని వ్యాఖ్యానించారు.

 

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని, ప్రభుత్వ వైఫల్యాలపై తాము ప్రశ్నించడం కొనసాగుతుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

 

“నేను ఎవరి కింద పని చేయలేదు… ప్రజల కోసం సిద్ధాంతాలకే కట్టుబడ్డా” – ఎమ్మెల్యే వ్యాఖ్యలకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు కౌంటర్

 

 

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, తాను ఎవరి వ్యక్తిగత ఆధీనంలో పని చేయలేదని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసినంత మాత్రాన “నా కింద పనిచేశాడు” అని చెప్పడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని రాచమల్లు విమర్శించారు. పార్టీ నాయకత్వంలో పనిచేయడం ఒకటి, వ్యక్తిగతంగా ఎవరి ఆధీనంలో పనిచేయడం మరోటని పేర్కొన్నారు. “మీరు మైసూర్ మహారాజు కాదు… టిప్పు సుల్తాన్ కూడా కాదు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం వహించడం వేరు, వ్యక్తిగత ఆధిపత్యం చెలాయించడం వేరు” అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుబట్టారు.

 

1998 నుంచి 2005 వరకు మాత్రమే కలిసి రాజకీయ ప్రయాణం సాగిందని, ఆ తర్వాత సిద్ధాంత భేదాల కారణంగా స్వతంత్ర రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. “ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం చేసే ద్వంద్వ వైఖరిని వ్యతిరేకించేందుకే నేను వేరుపడ్డాను” అని పేర్కొన్నారు.

 

తనను పోలీసులు అరెస్టు చేయకుండా కాపాడానన్న వ్యాఖ్యలను కూడా రాచమల్లు ఖండించారు. రామేశ్వరంలో బైపాస్ భూములను ఆక్రమణల నుంచి విడిపించి పేదలకు పంపిణీ చేసిన సందర్భంలో తనపై రాజకీయ కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. ఆ కేసు నేపథ్యంలో పోలీసులు వస్తున్నారని అప్పుడు ఎమ్మెల్యే సమాచారం ఇవ్వడం నాయకుడిగా చేయాల్సిన సహజ బాధ్యతేనని, దానిని ఇప్పుడు పెద్ద సహాయంగా ప్రచారం చేయడం సరికాదన్నారు.

 

ఆ ఘటనలో తాను చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొని రిమాండ్‌కు వెళ్లానని, రాజకీయ పోరాటంలో కేసులు, అరెస్టులు సహజమని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పోరాడిన సందర్భాలను ఇప్పుడు వక్రీకరించి చెప్పడం రాజకీయంగా సరైన విధానం కాదన్నారు.

 

ఎమ్మెల్యే తన కుమారుడి నిజాయితీ గురించి చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలే నాయకుల పనితీరుకు తుది న్యాయనిర్ణేతలని రాచమల్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం మానుకోవాలని సూచించారు.

 

ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి, పారదర్శక పాలనపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజార్చడం బాధాకరమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!