ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్వర్షంతో పులకించిన ప్రొద్దుటూరు..

వర్షంతో పులకించిన ప్రొద్దుటూరు..

📰 Generate e-Paper Clip

 

–జలమయమైన వీధులు

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు ప్రజలను వర్షం పలకరించింది. కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు జల్లులతో ఆనందం వ్యక్తం చేశారు.ఎల్‌నినో ప్రభావంతో గత కొన్ని రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. దీంతో ఉక్కపోత తీవ్రత పెరిగి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.అయితే భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యాయి. గాంధీరోడ్డు, శివాలయం సెంటర్, పాత బస్టాండ్, కొర్రపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేయగా.. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!