ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్కోటిమంది కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం–కార్యకర్తల తో లోకేష్

కోటిమంది కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం–కార్యకర్తల తో లోకేష్

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

కోటిమంది కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం ఆనీ కార్యకర్తల కు   మంత్రి లోకేష్  సూచించారు.2025 కడపలో జరిగిన మహానాడులో ఆరుశాసనాలను తీసుకున్నామన్నారు. అందులో ముఖ్యమైంది కార్యకర్తే అధినేత. దానిని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం అని అన్నారు. కోటిమందికి పైగా కార్యకర్తలున్న అతిపెద్ద కుటుంబం మనది. ఇంత భారీ వ్యవస్థలో చిన్నచిన్న సమస్యలు సహజం ఆనీ చెప్పారు. బూత్, క్లస్టర్, మండల, నియోజకవర్గ, పార్లమెంటు, జోనల్ స్థాయిల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ దశల్లో పరిష్కారం కాకపోతే కేంద్ర కార్యాలయం దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. కార్యకర్తల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నాయకులందరిపైనా ఉందన్నారు. పార్టీలో సంస్కరణల కోసం తాను ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందనీ గుర్తు చేశారు. సమస్యలను నాలుగుగోడల నడుమ సి ఎం తో చర్చిస్తాం అని బయటకు వచ్చాక జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ముక్తకంఠంతో నినదించాలనీ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!