ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్ఐ అహ్మద్ బాషా సేవలు ప్రశంసనీయం

ఎస్ఐ అహ్మద్ బాషా సేవలు ప్రశంసనీయం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పీసీఆర్లో ఎస్ఐగా పని చేస్తూ పదవీ విరమణ చేసిన ఎస్ కె  అహ్మద్ భాష సేవలు ప్రశంసనీయమని ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. కొర్రపాడు రోడ్డులోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో బుధవారం అహ్మద్ బాషా పదవీ విరమణ, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏఎస్పీ మాట్లాడుతూ అహ్మద్ బాషా 40 ఏళ్ల పాటు పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేయడం గొప్ప విషయమన్నారు. విధి నిర్వహణలో ఆయన నిస్వార్థమైన సేవలు అందించారని ఏఎస్పీ కొనియాడారు. ఆయన ఉమ్మడి కడప జిల్లాలోని వివిధ స్టేషన్లతో పాటు ప్రొద్దుటూరులో త్రీటౌన్, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పని చేస్తూ ఈ ప్రాంత వాసుల అభిమానాన్ని చూరగొన్నారు. అనంతరం అహ్మద్ బాషా దంపతులను ఏఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!