ఎస్ఐ అహ్మద్ బాషా సేవలు ప్రశంసనీయం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పీసీఆర్లో ఎస్ఐగా పని చేస్తూ పదవీ విరమణ చేసిన ఎస్ కె అహ్మద్ భాష సేవలు ప్రశంసనీయమని ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. కొర్రపాడు రోడ్డులోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో బుధవారం అహ్మద్ బాషా పదవీ విరమణ, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏఎస్పీ మాట్లాడుతూ అహ్మద్ బాషా 40 ఏళ్ల పాటు పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేయడం గొప్ప విషయమన్నారు. విధి నిర్వహణలో ఆయన నిస్వార్థమైన సేవలు అందించారని ఏఎస్పీ...