సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు ఉప విద్యా శాఖ అధికారిగా (డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) బాధ్యతలు స్వీకరించిన శివ ప్రసాద్ ను ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, శివ ప్రసాద్ సమర్థవంతమైన పరిపాలనతో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.శివ ప్రసాద్ మాట్లాడుతూ, అందరి సహకారంతో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపడతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
