ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్12 మంది శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు టి సి ఎస్ కు ఎంపిక

12 మంది శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు టి సి ఎస్ కు ఎంపిక

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం లో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అటానమస్, నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు 12 మంది టిసిఎస్ నందు కొలువుకు ఎంపిక అయ్యారనీ కళాశాల కరస్పాండెంట్ అరకట వేముల హరి నారాయణ తెలిపారు.   డిగ్రీ చదివే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగంతో బయటికి పోవాలి అనే లక్ష్యంతో దేశ్పాండే స్కిల్ ఎడ్యుకేషన్ వారితో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వివిధ ఐటీ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకు ఇంటర్వ్యూలకు రిటన్ టెస్ట్ లకు అటెండ్ కావడం జరిగింది. అందులో భాగంగా టిసిఎస్ నందు 12 మంది సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది అని కళాశాల కరస్పాండెంట్ అరకట వేముల హరి నారాయణ తెలిపారు.   కీర్తన,   ఆశ్రఫ్ జహ,  శ్రీప్రియ , మన్సూర్ భాష , జెస్సీ, పరిమళ, జీవిత, తన్మయి , దివ్య శ్రీ,  , వైష్ణవి, హుమేర,  తబస్సుమ్ లు టి సి ఎస్ ఎంపిక అయ్యారని  తెలిపారు.డిగ్రీ తో పాటు జాబ్ తెప్పియాలన్న లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రాంలో విజేతలుగా నిలిచిన వీళ్ళందరికీ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!