ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్మహిమాన్వితుడు " షా హుస్సేన్ వలి స్వామి"

మహిమాన్వితుడు ” షా హుస్సేన్ వలి స్వామి”

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

 

భక్తుల కోరికలు తీర్చే గొప్ప మహిమాన్వితుడు షా హుస్సేన్ వలి స్వామి అని కడప ఆస్థానే షామీరియా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ పీర్ షామీరి చిస్తీ ఆల్ ఖాద్రి సాహెబ్ కొనియాడారు.స్థానిక దర్గా బజారు లో ఉన్న హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి స్వామి దర్గా లో బుధవారం రాత్రి అంజుమన్ అలే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో జల్సా ఎ అజ్మతే ఆవలియా సభ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆస్థానే షామీరియా కడప పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ పీర్ షామీరి సాహెబ్ ప్రసంగించారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దర్గా చాలా పవిత్రమైనదని అయన చెప్పారు. 400 ఏళ్ల నుంచి స్వామి కృప లక్షలాది భక్తులు పై ఉందని ఎవరు వచ్చిన వారు నిరాశ, దుఃఖం తొలిగి సుఖ సంతోషాల తో వెళ్తున్నారని హితవు పలికారు. హజరత్ సయ్యద్ షాహ్ హుస్సేన్ వలి స్వామి ఇస్లాం ప్రవక్త స అ వంశీయులని, ఇమామ్ ఎ హుసేన్ ర జి షహీద్ ఎ కార్బలా ముని మనవడనీ వివరించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అంజుమన్ కమిటీ, ముక్తియర్ ఆధ్వర్యంలో దర్గా అభివృద్ధి పనులు అద్భుతంగా పూర్తి చేసారని అభినందించారు.

 

మొహరం నెల ప్రాముఖ్యత గురించి

 

మొహరం నెల చాలా పవిత్రమైన, ప్రాముఖ్యత కలిగిన నెల ఆయన చెప్పారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నెల మొదటి నెల అని ఇందులో 10 వరోజు అశురా అని చాలా విశిష్టత కలిగిన రోజని వివరించారు. ఈ నెలలో 9 ,10 లేదా 10,11 రోజులలో నఫిల్ ఉపవాసం ఉండాలని మహమ్మద్ ప్రవక్త స అ చెప్పారన్నారు . మహమ్మద్ ప్రవక్త దిన్ కాపాడేందుకు హజరత్ ఇమామ్ హుస్సేన్ ర జి , ఆయన కుటుంబ వీర మరణం (షాహదత్) పొందారన్నారు. సాధ్యమైనంత ఇమామ్ ఎ హుసేన్ ర జి స్మరించాలని పేదలకు అన్నదానాలు అలాగే ఖురాన్ పఠనం, ఫాతేహ చేయాలని పిలుపునిచ్చారు.

 

మతీన్ సాహెబ్ ఆధ్వర్యంలో అన్నదానం

 

కార్యక్రమం అనంతరం ప్రొద్దుటూరు ఆస్తానే ఎ జాహురియా బిరాదరె పీఠాధిపతి సయ్యద్ షా మతీన్ హుస్సేనీ ఆల్ మరూఫీ చిస్తీ ఆల్ ఖాద్రి సాహెబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఫాతిహా చేసిన లడ్డు లను భక్తుల కు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆస్థాన ఎ జాహురియా పీఠాధిపతి సయ్యద్ షా ముబీన్ హుస్సేనీ ఆల్ మరూఫీ చిస్తీ ఆల్ ఖాద్రి సాహెబ్ ,ఆస్థాన ఎ కమలియా ప్రొద్దుటూరు సయ్యద్ షాహ్ ముస్తఫా హుస్సేనీ ఖాద్రి ఉరఫ్ ఆరిఫుల్లా సాహెబ్, కడప బహదూర్ ఖాన్ మసీద్ ఖతీబ్ ముఫ్తీ సయ్యద్ షా సయీద్ అహ్మద్ సాహెబ్, దర్గా మసీద్ ఇమామ్ మౌలానా మేరాజ్ అలీ రజ్వీ, మౌలానా హఫీజ్ బషీర్ అహ్మద్ భాఖవి, కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు.

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!