ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeఎడిటోరియల్దొంగ పట్టాల ముఠా ను వెలికితీసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి –కొనిరెడ్డి డిమాండ్

దొంగ పట్టాల ముఠా ను వెలికితీసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి –కొనిరెడ్డి డిమాండ్

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

దొంగ పట్టాల ముఠా ను వెలికితీసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలనీ   కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి  డిమాండ్ చేశారు. ఆమృత్ నగర్ లో చర్చి కోసం కేటాయించిన స్థలాన్ని పలువురు నకిలీ పట్టాలు సృష్టించి కాజేసే యత్నం చేస్తున్నారని కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి కి స్థానికులు దృష్టికి తేవడంతో సోమవారం  ఈ విషయమై స్థానికులతో కలిసి తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూలీ పని చేసే వారుకూడా ₹ కోట్ల ఇండ్లు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.గత ఐదేళ్లుగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచిగా అమృత నగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయితే తన పదవీకాలం పూర్తి కాగానే కొందరు ఇక్కడి భూములను దొంగ పట్టాలతో కబ్జా చేస్తున్నారు. చివరికి సచివాలయం వద్ద ప్రజల కోసం 25 అడుగుల రోడ్డు వదిలితే, పంచాయతీ ఆజ్ఞలను సైతం బేఖాతరు చేస్తూ ఆ స్థలాన్ని కూడా ఆక్రమించి పనులు సాగిస్తున్నారని కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు నకిలీ పట్టాలు సృష్టించి నిజమైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పట్టాలు అసలైనవా లేక నకిలీవా అనే విషయాన్ని తేల్చేందుకు తాము వీటిని ల్యాబ్‌లో టెస్ట్ చేయిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్ వెంటనే స్పందించి ఈ దొంగ పట్టాల వ్యవహారాన్ని వెలికితీసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ భూదందాపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జిల్లా కలెక్టర్, ఏఎస్పీలు తక్షణమే చొరవ తీసుకొని విచారణ జరిపించాలని కోరారు. ఈ సమస్యపై త్వరలోనే ఎమ్మెల్యేను స్వయంగా కలిసి పూర్తి వివరాలు అందజేస్తామని, అధికారులు తక్షణమే స్పందించి కబ్జాలను అడ్డుకోకపోతే బాధితుల తో కలిసి పెద్ద ఎత్తున నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఇదే విషయమై స్థానిక బాధితులు మాట్లాడుతూ, సర్కారు స్థలాలను, రోడ్లను సైతం కబ్జా చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయని పక్షంలో, తాము అమృత నగర్ వదిలి వెళ్ళిపోవడం మినహా మరో మార్గం లేదని కన్నీరు మున్నీరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!