సలాం ప్రొద్దుటూరు:
ఆంధ్ర ప్రదేశ్ టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ వివరాల్లో పొరపాట్లను హెడ్మాస్టర్ల ద్వారా సవరించుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 15 వరకు పొడిగించినట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా వెరిఫై చేసి హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా పొరపాట్లను సవరించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
