సలాం ప్రొద్దుటూరు:
ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిలువ కోసం వార్తాపత్రికలను వినియోగించవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి స్పష్టంచేసింది. వీధి వ్యాపారులు (Street venders), రెస్టారెంట్లు (Restaurants), క్లౌడ్ కిచెన్లు సహా అన్ని రకాల ఆహార విక్రయ సంస్థలు ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. *వార్తాపత్రికల వాడకంవల్ల తీవ్రమైన ఆరోగ్య ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.వార్తాపత్రికల ముద్రణలో ఉపయోగించే సిరాలో సీసం వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు, ఇతర రసాయనాలు ఉంటాయని FSSAI వివరించిందివేడిగా ఉండే ఆహారపదార్థాలు, నూనెతో ఉండే సమోసా, పకోడీ, వడ వంటి పదార్థాలను పేపర్లలో చుట్టినప్పుడు, ఆ రసాయనాలు సులభంగా ఆహార పదార్థాల్లోకి చేరుతాయి. ఇలాంటి కలుషిత ఆహారాన్ని తీసుకోవడంవల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు సంభవించడంతోపాటు మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని FSSAI హెచ్చరించింది.
