ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నా, అవినీతి వ్యవహారంపై అధికారులు "విచారణ...

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నా, అవినీతి వ్యవహారంపై అధికారులు “విచారణ చేస్తున్నాం” అంటూ కాలయాపన చేయడం సరికాదని బిజెపి నేత వంకదార నరేంద్ర రవు అన్నారు. ఈ సందర్భంగా వైఎంఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు వంకధార నరేంద్ర మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల అంశంపై సమగ్ర, పారదర్శక మరియు నిష్పాక్షిక విచారణ చేపట్టి, అవినీతికి పాల్పడిన బాధ్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధ్యుల నుంచి పూర్తి స్థాయిలో రికవరీ చేయాలన్నారు. విచారణ పేరుతో ఆలస్యం చేయకుండా, సంబంధిత అధికారులు వెంటనే నివేదికను ప్రజల ముందుంచి నిజాలను వెల్లడించాలన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!