ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం–వైయస్ జగన్

బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం–వైయస్ జగన్

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Previous article
శ్రీశైలం జలాశయం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ మలుపు దగ్గర మట్టిలో ఇరుక్కుపోయిన ట్రావెల్స్‌ బస్సు దోమలపెంట చెక్‌పోస్ట్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు దాదాపు 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు బస్సును పక్కకు తీసేందుకు స్థానికుల ప్రయత్నాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం. విశాఖ స్టీల్ ప్లాంట్లో sms 2 డిపార్ట్మెంట్లో ప్రమాదం. ల్యాడిల్‌ నుంచి కుప్పకూలిన హాట్‌మెంట్‌ బకెట్లు. పెద్దమొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులకు గాయాలు. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది…
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!