సలాం ప్రొద్దుటూరు (రూరల్):
గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ హెచ్చరించారు. జిల్లా ఎస్.పి . షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ లో ఉన్న అమృత నగర్ కాలనీ వాసులకు ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని , అలాగే గొడవలు పడకూడదని చెప్పారు.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల గురించి వివరించారు. ఇలాంటి ఆపద సమయాల్లో తక్షణ సహాయం కోసం అందుబాటులో ఉన్న ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లను 112 (అత్యవసర సహాయం), చైల్డ్ లైన్ 1098 (పిల్లల రక్షణ),గృహ హింస 181,మహిళ వేధింపులు 1091,సైబర్ నేరాల టోల్ ఫ్రీ 1930 డయల్ చేయాలన్నారు.ప్రతి మహిళ తమ భద్రత కోసం ప్రభుత్వ కల్పించిన చట్టాలను తెలుసుకోవడం ముఖ్యమన్నారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.హెవీ, లైట్ వెహికల్స్ లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ , ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుుకోవాలని సూచించారు.అలాగే డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరమని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల వల్ల ఒక కుటుంబం ఆర్ధికంగా ఎంతో నష్టపోతుందని, కుటుంబ పెద్ద తీవ్రంగా గాయపడితే కుటుంబ సభ్యుల మనో వేదన లాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదన్నారు.ఈ కార్యక్రమం లో ప్రొద్దుటూరు రూరల్ ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
.
