సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను 2026 నిర్వహించనున్నారు. భగవద్గీతలోని 108 శ్లోకాలను భావంతో సహా ఎంపిక చేయడం జరిగిందని ఇస్కాన్ టెంపుల్ వారు తెలిపారు. చిన్నారుల హృదయాలలో ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. గెలిచిన విద్యార్థులకు మొదటి బహుమతి రూ. 1,00,000, రెండవ బహుమతి రూ.50,000, మూడవ బహుమతి రూ.25,000 ఇవ్వనున్నారు.
