సలాం ప్రొద్దుటూరు (తాడేపల్లి):
డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై బుధ వారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఫిర్యాదు చేసిన డీఎస్సీ అభ్యర్థులు.అర్హత ఉన్నా తమకు ఉద్యోగం ఇవ్వకుండా పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయ పోరాటాలకు వైయస్ఆర్సీపీ తోడుగా ఉంటుందనీ పార్టీకి చెందిన లీగల్ విభాగం తమకు సహాయపడుతుందనీ అలాగే లీగల్ ఖర్చులను కూడా పార్టీనే భరిస్తుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు దీంతో పాటు డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం.. 2029లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ-ఎంక్వైరీ చేయిస్తామని హామి.
