ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్చంద్రబాబు మీది వెన్నుపోటు పార్టీ

చంద్రబాబు మీది వెన్నుపోటు పార్టీ

📰 Generate e-Paper Clip

–రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

సలాం ప్రొద్దుటూరు:

ప్రజలకు అమలు చేసే హామీలు మాత్రమే ఇవ్వాలి ?నోటికి వచ్చినట్లు హామీలు ఇస్తే ఎట్లా ? ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానమైన నెరవేర్చారా ? చంద్రబాబు మీది వెన్నుపోటు పార్టీ అని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దొరసానిపల్లి లోని ఆయన స్వగృహంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడి ”చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు” అనే పోస్టర్ విడుదల చేసారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.
బాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతుందన్నారు. సంక్షేమం ,అభివృద్ధి, స్త్రీ మాన , ప్రాణానికి రక్షణ ఇచ్చాడా ?ప్రజలకు బాబు ఏమి ఇచ్చాడు ? హామీలు నెరవేర్చారా? కొత్త పెన్షన్ ఇచ్చారా ? అదే వైయస్ జగన్ తన ప్రభుత్వంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ మంజూరు చేసేవారన్నారు. వికలాంగులు వితంతువులు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీ లకు పెన్షన్ ఇస్తానని ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో ఇస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. ఇస్తానని మాట చెప్పి ఇవ్వకుంటే ప్రజల్ని మోసం చేయడం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఒకరికైనా ఇచ్చారా అని ఘాటుగా ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కానీ ఒక ఉద్యోగం అయినా ఇచ్చారా అని నిలదీశారు. నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వంలో సచివాలయల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీటిలో ఒక ఉద్యోగం కూడా రికమండేషన్ ద్వారా ఎవరికి రాలేదన్నారు. బాబు ప్రభుత్వం రైతులకు మోసం చేసిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులు డబ్బులు కట్టలేక ఇండ్లకు పరిమితమవుతున్నారని ,కొందరు గుమస్తాలుగా పనిచేస్తున్నారని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. కేవలం పెద్దింటి పిల్లలు మాత్రమే చదువులు కొనసాగిస్తున్నారన్నారు. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు వైయస్సార్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడారని ఆయన చెప్పారు. కరెంట్ బిల్ పెంచి ప్రజలపై అదనపు భారం మోపారన్నారు . డీజిల్ ,పెట్రోల్ పెంచామని చెప్పి ఆరుసార్లు ఇప్పటికే పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర ధరలు పెరగవని చెప్పారు కానీ పేదోడు పట్టేడు అన్నం కోసం పాట్లు పడుతున్నాడని చెప్పారు. రైతులు,చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మూడు సెంట్ల లో ఇల్లు కట్టిస్తానని చెప్పి కట్టించలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే తాము ప్రశ్నించడానికి శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసులతో ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం చాలా బలమైందని దీన్ని బాబు తెలుసుకోవాలని ఆయన చెప్పారు. అమ్మ ఒడి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి 20 లక్షల విద్యార్థులకు ఇవ్వకుండా ఎగరు కొట్టారన్నారు. కొందరికి మాత్రం 9 నుంచి 13 వేల రూపాయలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం వచ్చాక ఏ పథకమైన సజావుగా జరుగుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు ఎవరైనా సరే వారు చెప్పే వీధిలో లేదా వార్డులో వస్తామని వార్డు ప్రజలకు వందమంది పిలిపించి అందరి ముందర ఎవరికైనా ఆరు సిలిండర్లు వచ్చాయా లేదా అడిగి తెలుసుకుంటామన్నారు.100 మందిలో 60 మంది వచ్చిందని నిరూపిస్తే తాను రాజకీయాల్లో రానని సవాల్ విసిరారు. ఈనెల 4వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన చెప్పారు.8 వ తేదీన ఫోటో ప్రదర్శన,12 వ తేదీన పదివేల మందితో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!