–67వ ఉచిత వైద్య శిబిరంలో 89 మందికి కంటి, గుండె పరీక్షలు
–25 మందికి ఉచిత ఈసీజీ.. 10 మందికి గుండె స్కానింగ్
సలాం ప్రొద్దుటూరు:
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే గొప్ప సంకల్పంతో ప్రొద్దుటూరులోని లక్ష్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మందికి ఆరోగ్య భరోసా కల్పిస్తున్నాయి.ప్రతి నెల మూడవ ఆదివారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం 67వ ఉచిత కంటి, గుండె వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
గుండె వైద్య సేవల్లో ప్రత్యేక శ్రద్ధ
ఈ శిబిరంలో డా. పాతకోట శ్రీనాథ్ రెడ్డి గారు 46 మంది రోగులకు ఉచితంగా గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 25 మందికి ఉచితంగా ఈసీజీ (ECG), మరో 10 మందికి ఉచితంగా గుండె స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగులకు అవసరమైన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై తగిన సూచనలు చేశారు.
43 మందికి ఉచిత కంటి పరీక్షలు
అదేవిధంగా డా. హరిత గారు 43 మంది రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వారి కంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స, వైద్య సలహాలు అందించారు.
నిరంతర సేవే లక్ష్యం.. పేదలకు ఆరోగ్య భరోసా
ప్రతి నెలా క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. వైద్య సేవలను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ లక్ష్య హాస్పిటల్ వైద్యులు అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని డా. పాతకోట శ్రీనాథ్ రెడ్డి, డా. హరిత తెలిపారు.

