ePaper
Saturday, November 28, 2026
ePaper

📰 Generate e-Paper Clip

 

 

– నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఉదారత చాటుకున్న ప్రొద్దుటూరు అక్కినేని అభిమానులు

 

– అభిమాని కష్టకాలంలో అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న అభిమాన సంఘం

 

సలాం ప్రొద్దుటూరు:

 

అభిమానం అంటే కేవలం అభిమాన నటుల పుట్టినరోజులు జరుపుకోవడం, వేడుకలు నిర్వహించడమే కాదు.. తోటి అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలవడమని ప్రొద్దుటూరు అక్కినేని అభిమానులు నిరూపించారు.రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ఉదయ్ అక్కినేని కుటుంబానికి వీరాభిమాని. అయితే, గత కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయ్ గాయపడటంతో ఆయన కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ప్రొద్దుటూరు అక్కినేని అభిమానులు మానవతా దృక్పథంతో స్పందించారు.అక్కినేని నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయ్ కుటుంబ పోషణకు తోడ్పాటుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అభిమాని కష్టకాలంలో ఆయన కుటుంబానికి అండగా నిలవడం ద్వారా అభిమానానికి నిజమైన అర్థాన్ని చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లావైడ్ అక్కినేని నాగార్జున యువశక్తి ప్రెసిడెంట్ నల్లం రవిశంకర్, డీఎం. బాషా, సత్యం, శ్రీను, గణేష్, మున్నా, ఖలీల్, పుల్లారెడ్డి, హరిబాబు రెడ్డి, బాలు, రవికుమార్, సుబ్బారాయుడు, రాఘవ, రాజీవ్ తదితర అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.అభిమానం ఆరాధనలోనే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచినప్పుడే దాని విలువ మరింత పెరుగుతుంది. ఉదయ్ కుటుంబానికి అభిమానులు అందించిన ఈ ఆర్థిక సహాయం మానవత్వానికి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!